పౌర పఠన కేంద్రాన్నీ ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మీర్ పేట్ కార్పొరేషన్ శ్రీ లలితా నగర్ లో పౌర పఠన కేంద్రాన్నీ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా దినోత్సవంలో భాగంగా జిల్లాలో 25 పౌర పఠన కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 2500 జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ పఠన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, మొదటగా పైలట్ ప్రాజెక్ట్ గా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే 5 కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 30కి చేరాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పౌర పఠన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, మీర్ పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Home
Unlabelled
పౌర పఠన కేంద్రాన్నీ ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: