కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో,,,వెలుగులోకి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పేరు


తాజాగా చోటుచేసుకొన్న  తెలంగాణలో డ్రగ్స్ కేసుల వ్యవహారం ప్రముఖుల మెడకు చుట్టుకొంటోంది. ప్రొడ్యూసర్ కేపీ చౌదరికి చెందిన ఫోన్, గూగుల్ డ్రైవ్ డేటాను సేకరించిన పోలీసులు.. అందులో ఉన్న కాంటాక్ట్స్ లిస్ట్, ఫోన్ కాల్స్, ఫొటోలను బట్టి.. దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ క్రమంలో.. సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది సెలెబ్రెటీల పేర్లు బయటికి వస్తుండగా.. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ పేర్లు కూడా బయటికి వస్తున్నాయి. ఈ కేసులో అనూహ్యంగా ప్రముఖ బ్యాట్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. కేపీ చౌదరి ఫోన్ డేటాలో సిక్కిరెడ్డితో వందల కాల్స్ మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. కృష్ణ ప్రసాద్ చౌదరిని అరెస్టు చేసే సమయంలోనే బ్యాట్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి ఇంట్లో పార్టీ ఇచ్చినట్లుగా కేపీ పోలీసులకు తెలిపారు.

ఇదిలా ఉంటే.. సిక్కిరెడ్డి మాత్రం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే.. సిక్కిరెడ్డితో కేపీ చౌదరి మాట్లాడి.. ఆమె ఇంట్లో లేని సమయంలోనే డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ పార్టీలకు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు సిక్కిరెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీల నిర్వహణపై కూపీ లాగుతున్నారు. అంతే కాకుండా సిక్కిరెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు.

ఈ వ్యవహారంపై సిక్కిరెడ్డి భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమిత్ స్పందించారు. స్నేహిత హిల్స్‌లో ఫ్లాట్‌ని తమ పెళ్లికి ముందు గిఫ్ట్‌గా ఇచ్చారని.. ఆ ఫ్లాట్ సిక్కిరెడ్డి పేరు మీద ఉందని వివరించారు. వేరే ఫ్లాట్‌కి షిఫ్ట్ అయ్యే వరకు నాలుగు రోజులు తమ ఫ్లాట్ కావాలని కేపీ చౌదరి అడిగినట్టు చెప్పుకొచ్చారు. ఎలాగో ఆ ఫ్లాట్‌లో తాము ఉండట్లేదు కదా అని కేపీకి ఇచ్చినట్టు చెప్పారు. ఆ ఫ్లాట్‌లో ఏం జరిగిందో తమకు మాత్రం తెలియదని.. తాము రెస్పాన్సిబుల్ కూడా కాదని సుమిత్ తెలిపారు.

ప్లేయర్స్‌గా తాము చాలా జాగ్రత్తగా ఉంటామని సుమిత్ పేర్కొన్నారు. పార్టీ కల్చర్ అలవాటు ఉండదని.. ఒకవేళ పార్టీకి వెళ్లినా ఎలాంటి డ్రింక్స్ తీసుకోమని చెప్పుకొచ్చారు. తాము ప్రతీ మ్యాచ్‌కి ముందు డోప్ టెస్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. సిక్కిరెడ్డి పేరుతో ఫ్లాట్ ఉన్నంత మాత్రాన ఆమెకు డ్రగ్స్‌తో లింక్ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా కేపీ చౌదరి అరెస్ట్ అవడంతో పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల గుండెల్లో గుబులు పుట్టుకొచ్చింది. దీంతో ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చి తమకు కేపీ చౌదరితో మాత్రమే సంబంధం ఉందని.. తాము డ్రగ్స్ తీసుకోమంటూ చెప్తున్నారు. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: