శంకర్ పల్లి రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్  న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

శంకర్ పల్లి రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణ  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పేర్కొన్నారు. రూపాయలు 5 కోట్ల 27 లక్షలతో మీర్జాగూడ-జన్వాడ  రోడ్డు పనులకు,జన్వాడ లో రోడ్డు పనులకువిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.  ఎమ్మెల్యే యాదయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....శంకర్ పల్లి రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా చిరు జల్లులు కురవడం సంతోషం కల్గిస్తుందన్నారు.  ప్రజలందరికీ ఆధ్యాత్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు,కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారని అన్నారు.దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని గుడులు, మసీదులు,చర్చిలు ముస్తాబు చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించించినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని,  ప్రతి ఒక్కరు 2014 కు ముందు, తర్వాతి పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు.  ప్రజలతో ప్రజాప్రతినిధులు మమేకం అయి పల్లె ప్రగతితో చేపట్టిన కార్యక్రమాలు సత్పలితాలు ఇచ్చాయన్నారు. చట్టాలను మార్చి గ్రామాలు అభివృద్ధి చెందే దిశగా,  జాతీయ స్థాయిలో అవార్డులు పల్లె ప్రగతి వల్లే సాధ్యం అయ్యాయన్నారు. గ్రామాల్లో ఒక్కో విభాగానికి సంభందించి  ఒక్కో కమిటీ వేసినట్లు తద్వారా,  చెత్త రహిత గ్రామంగా


హరితహారం ద్వారా విరివిగా మొక్కలు నాటడంతో నేడు రాష్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.  విధులు చెప్తూ నిధులు ఇస్తూ తెలంగాణ పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్ళు,పాత గోడలను పూర్తిగా తొలగించడం,పాడు పడ్డ బోర్లను పూడ్చినట్లు తెలిపారు.  గతంలో 8 వేలు ఉన్న గ్రామ పంచాయతీలు 4 వేల వరకు నూతనంగా ఏర్పాటు చేయడంతో 12 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయని, 500 జనాభా ఉన్న తండా లను కూడా  గ్రామ పంచాయతీ లుగా చేసినట్లు తెలిపారు.  ఆయా గ్రామాలకు నూతన కార్యదర్శులను కూడా నియమించినట్లు పేర్కొన్నారు.  ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  ఇందుకు గాను 85 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం,నర్సరీ,వైకుంఠ దామాలు, క్రీడా మైదానాలు,ట్రాక్టర్లు,ట్యాంకర్ లు,ట్రాలీలతో తెలంగాణ పల్లెలు కళకళలాడుతున్నాయని,ఇతర రాష్టాల ప్రజలు కూడా ఇవి కోరుకుంటున్నారన్నారు. దాంతోసర్పంచ్ల గౌరవం పేరిగిందన్నారు. ఇప్పటివరకు 63 వేల కోట్లు రైతు బంధు నిధులు రైతుల అకౌంట్లలో వేయటం జరిగిందన్నారు.  త్వరలో వానాకాలంకు సంభందించి రైతుల అకౌంట్లలో రైతు బంధు నిధులు వేయనున్నట్లు తెలిపారు. ఎండాకాలంలో నీటి కోసం మహిళలు నానా కష్టాలు పడేవారని, మీటింగ్ల దగ్గరకు వచ్చి మోర పెట్టుకునేవారని, వేసవి వస్తే మంచినీటి పై అధికారులతో సమీక్షలు నిర్వహించేవాళ్ళమని నేడు


మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.  గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్లు 2 వేలు, వికలాంగులకు 4 వేలకు పెంచి గొప్ప మానవత వాదిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారన్నారు. ఫ్లోరైడ్ నీటి స్థానంలో రక్షిత మంచినీరు అందిస్తుండటంతో ప్రజల ఆరోగ్యాలు బాగుంటున్నాయని, సీజనల్ వ్యాధులు తగ్గాయన్నారు. రాష్ట్రంలో 19 వేల ప్రకృతి వనాలు  750 కోట్లు ఖర్చుతో నిర్మించమన్నారు. హరితహారం లో భాగంగా ఇప్పటివరకు 230 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని, అడవుల శాతం పెరిగిందని,తెలంగాణ లో 7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు.  నాడు కరెంట్ కోసం నానా తిప్పలు పడేవారని, ట్రాన్స్ఫార్మర్స్ పాడైపోతే రైతులు చందాలు వేసుకొని ట్రాక్టర్లలో  తీసుకెళ్లి బాగు చేయించుకునే వారని,  కానీ నేడు ట్రాన్స్ఫార్మర్స్,నూతన లైన్లు,స్తంభాలు వెంటనే సమకురుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్, రైతు బంధు,భీమా, సకాలంలో ఎరువులు అందిస్తూ, 24 గంటల విద్యుత్ అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. అదే స్ఫూర్తితో మా గ్రామం మా పాఠశాల అని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలు బడులను గుడులుగా భావిస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ 7 వేల300 కోట్లతో మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా దినోత్సవం సందర్భంగా ఒక వేయి పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నాం అన్నారు.

ప్రభుత్వం పేదలకు,ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు  ఇస్తుందని, గృహ లక్ష్మి కింద 3 లక్షలు ఇల్లు కట్టుకోవటానికి ఇస్తుందన్నారు. 30 లక్షలు మిర్జాపూర్  అనుబంధం గ్రామానికి రోడ్డు నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  గ్రామ పంచాయతీ లు ఇంకా బాగా పనిచేయాలని, రాష్ట్ర,జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాలన్నారు. గర్భిణీలకు ప్రభుత్వం అమ్మ వడీ, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు ఇస్తూ వారి ఆరోగ్యం కోసం  కృషి చేస్తుందన్నారు.  చెరువులలో పూడిక తీతతో ఎండాకాలంలో కూడా  చెరువుల నిండా నీరు ఉందని, నాడు పశువుల కోసం తొట్టెలు కడుతుండేవారని, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. ఒక చెరువు అభివృద్ధి చెందితే భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీరు వస్తుందని,  ఆ ప్రాంతంలో నీటి సమస్య ఉండదన్నారు. ఆ చెరువుల్లో చేప పిల్లలు వదిలితే ముదిరాజ్, మృత్సకారులకి ఆదాయం వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి కోల్పోయిన  కుల, చేతి వృత్తుల వారికి కుటుంబానికి అండగా ఉండటానికి మానవీయ కోణంలో ఆలోచించి లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని,  ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలన్నారు.  అందరూ ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయ పడుతారన్నారు. గతంలో ఎక్కడో ఒక్క చోట ఉండే గురుకులాలు 1000 ఏర్పాటు చేస్తే అందులో 5 లక్ష ల మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రయివేటు బడులకు ఇంగ్లీష్ బోధన కోసం వెళ్తుంటారని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం నుండి 8 వ తరగతి నుండి ఆంగ్లంలో బోధన ప్రారంభించారని,  ఈ సంవత్సరం 9 వ తరగతి వరకు ఆంగ్ల బోధన ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాలు, డ్రెస్సులు, రాగి జావా ఇవ్వాలని, ఉపాద్యాయులకు ట్యాబ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి, విద్యా దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. నూతన సెక్రటేరియట్ లో మొదటి సమావేశం పాలమూరు రంగారెడ్డి పై ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టారని, కాలేశ్వరం ప్రాజెక్ట్ లాగే పాలమూరును పూర్తి చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. దాంతో మన ప్రాంతానికి నీరు వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ మారేపల్లి పాపారావు, వైస్ చైర్మన్ వెంకటేష్, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి,  గ్రామాల సర్పంచ్లు రవీందర్ గౌడ్, లలిత నరసింహ్మ,  శ్రీనివాస్,  ఎంపీడీవో వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు గోపాల్, సీనియర్ నేతలు గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వాసుదేవ్ కన్నా,  బాలకృష్ణ,  గోవర్ధన్ రెడ్డి,  శ్రీనాథ్ గౌడ్, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు,  ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు, యువత,  తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: