వైద్య దినోత్సవం సందర్భంగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య దినోత్సవం సందర్భంగా గర్భిణీ మహిళల్లో రక్త హీనత పెంపొందించే దిశగా   న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 14 న వైద్య దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై గురువారం నాడు మంత్రి సెక్రటేరియట్ లోని ఛాంబర్ లో సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని,ప్రజల చెంతకు వైద్యాన్ని తీసుకువెళ్తున్నారని అన్నారు.


నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తూ,అనేక నూతన పిహెచ్సి లు,అర్బన్ పిహెచ్సి లు,బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని అన్నారు.అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా పరీక్ష కేంద్రాలు ,డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు,  డిప్యూటీ ఉప వైద్యాధికారి గీత,  వైద్య శాఖ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: