బీజేపీ కీలక కార్యక్రమానికి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరం

ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్లు దూరంగా ఉన్నారు. కీలక నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి వీరు హాజరుకాకపోవడంపై చర్చ సాగుతోంది. అధిష్ఠానం వైఖరి పట్ల వీరిద్దరు ఆగ్రహంతో ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు.

ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఈటలకు వ్యతిరేకంగా సమావేశమై అసలు పార్టీలో ఆ పదవి ఉండదని, జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలతో చర్చించాక ప్రకటిస్తుందని, అంతే తప్పితే లీక్ లు ఇవ్వవద్దని అంటున్నారు. అప్పటి నుండి ఈటల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: