తెలంగాణ అమరవీరుల స్థూప పనులను,,,

పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్థూప పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గురువారం నాడు వికారాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి గెస్ట్ హౌస్ ముందు నిర్మిస్తున్న అమర వీరుల స్థూపాన్ని పరిశీలించి పలు సూచనలు చేసారు. దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో స్తూపం నిర్మాణానికి నిర్ణయించి మంత్రి అదేశాలివ్వగా,వెంటనే పనులు ప్రారంభించగా,శరవేగంగా  కొనసాగుతున్నాయి. ఈ స్థూపాన్ని 22 న జరిగే దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున ఆవిష్కరించనున్నారు.  ఈ కార్యక్రమ ట్యాంక్ బండ్ పై నిర్మించిన అతిపెద్ద అమరవీరుల స్థూపం ప్రారంభం రోజునే ప్రారంభం కానుండటం విశేషంగా చెప్పవచ్చును.  తుదిమెరుగులు దిద్ది త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి,  బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్,  జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్,  గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, అధికారులు పాల్గొన్నారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: