ఉద్ధవ్ వర్గం నేతల సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలు
కరోనా సమయంలో ఫీల్డ్ ఆసుపత్రుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై దర్యాఫ్తులో భాగంగా ఈడీ ముంబైలోని పదిహేను ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో ఐఏఎస్ అధికారి సంజయ్ జైస్వాల్ ఇల్లు, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత ఆదిత్య ఠాక్రేకు సన్నిహితుడిగా పేరున్న సూరజ్ చవాన్ ఇల్లు ఉన్నాయి. ఉద్దవ్ ఠాక్రే వర్గం సంజయ్ రౌత్ మిత్రుడు సుజిత్ పాట్‌కర్ ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. కరోనా ఫీల్డ్ ఆసుపత్రి స్కాంలో మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నాయి.
సంజయ్ జైస్వాల్ గతంలో థానే కమిషనర్ గా విధుల నిర్వహించారు. కరోనా సమయంలో ముంబై డిప్యూటీ కమిషనర్ పదవిలో కూడా పని చేశారు. ఈ కేసుకు సంబంధించి జనవరిలో బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
మరోవైపు, సుజిత్ పై గతంలోనే మనీ లాండరింగ్ అభియోగాలు నమోదు చేసింది ఈడీ. హెల్త్ కేర్ రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కరోనా సమయంలో అతడికి ఫీల్డ్ ఆసుపత్రి కాంట్రాక్ట్ దక్కింది. ఇందుకు సంబంధించి బీజేపీ నేత కీర్తి ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదయింది. తప్పుడు విధానంలో వీరు ఫీల్డ్ ఆసుపత్రుల కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లుగా అభియోగాలు ఉన్నాయి.
Home
Unlabelled
ఉద్ధవ్ వర్గం నేతల సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: