అంధకారంలో,.....బీసీ కాలనీ 

గడివేముల మండలం లోని బీసీ కాలనీ దుస్థితి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

విద్యుత్ అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి నంద్యాల జిల్లా గడివేముల మండలం స్థానిక బీసీ కాలనీ అని ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. బీసీ కాలనీలో వీధిలైట్లు వేలుగకపోవడంతో  ఆ కాలనీ ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. తమ కాలనీలో విద్యుత్ లైటు వెలగకపోవడంపై అక్కడి ప్రజలు సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.  సమస్యపై స్పందించాల్సిన విద్యుత్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి తమ కాలనీలోని వీధిలైట్లు వెలిగేలా చేయాలని బిసి కాలనీ ప్రజలు కోరుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: