మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు నిధుల వరద
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు...
ఒక ప్రత్యేక విజన్ తో కార్పొరేషన్ సమగ్రాభివృద్ధి....
ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాం...
పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృతా మార్కెట్, వైకుంఠ దామాల నిర్మాణం...స్వచ్ఛతకు చిరునామాగా
ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిది)
బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సుమారు 15 కోట్ల భారీ నిధులతో చేపట్టే పలు కార్యక్రమాలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.... 1200 కోట్లతో నాళాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో,110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు,ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామని.గుర్రం గూడ,కూర్మల్ గూడ,జిల్లెల గూడ,బడంగ్ పేట్ ల వద్ద రిజర్వాయర్లు పనులు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో బడంగ్ పేట్,మీర్ పేట్,జల్ పల్లి ల పరిధిలోని 10 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెల్పిన మంత్రి,10 ఏళ్ల కాలంలోనే అనేక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అదే సందర్భంలో బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో 12 లక్షలతో సాయి బాలాజీ టౌన్ షిప్ 2లో పైప్ లైన్ పనులకు,12 లక్షలతో సీసీ రోడ్డు పనులకు,మరో 15 లక్షలతో ఎస్ డబ్ల్యు పైప్ లైన్,సీసీ రోడ్లకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. 3 వ డివిజన్ లో ఆర్ ఎం ఆర్ కాలనిలో 64 లక్షలతో నిర్మించే స్ట్రామ్ వాటర్ పైప్ లైన్ పనులకు,2 కోట్ల రూపాయలతో 1,2,3,20 డివిజన్ల పరిధిలో అయ్యంగార్ బేకరీ నుండి అల్మాస్ గూడ వరకు బీటీ రోడ్డు పనులకు,23,28,25,24,3,2 డివిజన్ల పరిధిలోని మారుతి నగర్ నుండి అల్మాస్ గూడ వరకు 2 కోట్ల నిధులతో చేపట్టే బీటీ,సీసీ రోడ్డు పనులకు,2 వ డివిజన్ లో 30 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు,మరమ్మత్తు పనులకు,,11 లక్షలతో ఎస్ఎస్ఆర్ కాలనిలో బీటీ,సీసీ రోడ్డు పనులకు కూడా మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి శంకు స్థాపన చేశారు.
వీటితోపాటు రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న కోమటికుంట చెరువు సుందరికరణ పనులకు, 4 వ నంబర్ డివిజన్లో బిఆర్ఆర్ కాలనిలో 20 లక్షలతో సీసీ రోడ్డు పనులకు,రామిడి హిల్స్ లో 10 లక్షలతో సీసీ రోడ్డు కు,ఒక కోటి 30 లక్షలతో 4,5,26 డివిజన్ల పరిధిలో సబ్ స్టేషన్ నుండి శ్రీ హిల్స్ కాలనీ వరకు వేయనున్న బీటీ రోడ్డు పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఒక కోటి రూపాయల నిధులతో మాత గుడి నుండి స్వేచ్ఛ నివాస్ వరకు 4,5 డివిజన్ల పరిధిలో నిర్మించిన
రోడ్డును,డివిజన్ నంబర్ 4 లో 12 లక్షలతో వెంకటేశ్వర కాలనిలో చేపట్టిన పైప్ లైన్ పనులకు,సౌభాగ్య నగర్ లో 22 లక్షలతో ఎస్ డబ్ల్యు పైప్ లైన్ పనులకు,మధుర పూరి లో 60 లక్షలతో వేసిన పైప్ లైన్ పనులను ప్రారంభించి వాటిని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు అంకితం చేశారు. డివిజన్ 4 లో రెండు కోట్ల రూపాయలతో పోచమ్మ కుంట చెరువు సుందరికరణ పనులకు కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.
Post A Comment:
0 comments: