కొల్లూరు డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవంలో...

సీఎం కేసీఆర్ తో కలిసి పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

కొల్లూరు డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద 15,660 డబుల్ బెడ్ రూమ్‌ల గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టౌన్ షిప్ ను సీఎం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సి.హెచ్ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: