విద్యారంగలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన కేసీఆర్

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

స్కూల్ బిల్డింగ్ ను  ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో  మన ఊరు మన బడి  కార్యక్రమంలో భాగంగా స్కూల్ బిల్డింగును తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మొయినాబాద్ రెసిడెన్సియల్ పాఠశాలలో ఒక కోటి రూపాయలతో  నిర్మించే ల్యాబ్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసారు.  ఈ సందర్భంగా లైబ్రరీ కార్నర్ ను ప్రారంభించి విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు,  యూనిఫామ్ లు పంపిణీ చేసి రాగి జావా అందించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు 136 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, 190 కోట్లతో  ఉచితంగా టెక్స్ట్ బుక్స్,సంవత్సరానికి  35 కోట్ల ఖర్చుతో రాగి జావా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. 


12 లక్షల మంది విద్యార్థులకు 56 కోట్ల విలువ గల నోట్ బుక్స్, 34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్స్ 20000  వేల మంది టీచర్స్ కు అందిస్తున్నట్లు తెలిపారు. మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 9123 పాఠశాలలో  3497.62 కోట్లతో పనులు చేపట్టి  దాదాపు 1000 పాఠశాలలను విద్యా దినోత్సవం సందర్భంగా ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యా రంగానికి నిధులు కేటాయిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి  ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. 

1200 కి పైగా గురుకులాలలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్ష 20 వేలు వెచ్చిస్తుందన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు,డిజిటల్ తరగతి గదులు కూడా ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో లైబ్రరీ కార్నర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. పేద,మధ్య తరగతి విద్యార్థుల విదేశీ కలను సాకారం చేసే దిశగా ఓవర్సీస్  స్కాలర్ షిప్ లు అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో 6 కోట్లతో  టెక్స్ట్ బుక్స్,10 కోట్ల 50 లక్షలతో 1.65లక్షల మంది  రెండు జతల యూనిఫామ్ లు,5 కోట్ల విలువ చేసే 72 వేల మంది విద్యార్థులకు నోట్ బుక్స్,18.15 లక్షలతో రాగి జావా 1.6 కోట్ల విలువ చేసే 1058 ఉపాద్యాయులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు నూతన హంగులు సంతరించుకుంటున్నాయని అన్నారు. మన ఊరు మన బడి తో 12 రకాల సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరుస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి, మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: