ప్రకాశ్ జావడేకర్ దైవభక్తి ఉన్న నాయకుడు: బండి సంజయ్

కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. అదంతా అవాస్తవమని అన్నారు. ప్రకాశ్ జావడేకర్ దైవ భక్తుడని.. చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదని అన్నారు. ఆయన చెప్పులు బయటే విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారని చెప్పారు. ఆ సమయంలో తాను వారితోనే ఉన్నానని వివరణ ఇచ్చారు.

కరీంనగర్‌లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించడానికి టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన బండి సంజయ్‌ను మీడియా ప్రతినిధులు ఆ వీడియోపై వివరణ అడిగారు. దానికి బదులిచ్చిన ఆయన.. అలాంటిందేమీ లేదని చెప్పారు. "ప్రకాశ్ జావడేకర్ వయస్సు 73 ఏళ్లు. ఆయన నడుస్తుంటే జారి కింద పడబోతే నేనే పట్టుకున్నా.. దానిని కూడా ఫాల్తుగాళ్లు రాద్దాంతం చేస్తారా ? సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేములవాడ రాజన్న ఆలయ అయ్యగారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి" అని బండి సంజయ్ అన్నారు.

కరీంనగర్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో ప్రకాశ్ జావడేకర్ ఆదివారం పాల్గొన్నారు. అక్కడి సభలో మాట్లాడిన అనంతరం ఆయన వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చెప్పులు వేసుకొని ఆలయంలోపలికి వెళ్లారంటూ ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధికార బీఆర్ఎస్‌కు చెందిన కొందరు నాయకులు వాటిని షేర్ చేసి విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పులు వేసుకొని వెళ్లలేదని చెప్పారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: