ఇండోర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను  తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....నాడు చేపల కోసం ఆంధ్ర మీద ఆధారపడే వాళ్ళమని....నేడు మన చెరువుల్లోనే చేపలు పుష్కలంగా లభిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 27 వేల పై చిలుకు చెరువుల్లో,3 ఏళ్ళలో 10 వేల కోట్లు ఖర్చు పెట్టి పూడికతీత పనులు చేపట్టి సత్పలితాలు సాధించినట్లు తెలిపారు. నాడు ఎండిన చెరువులతో,పశువుల కోసం తొట్టిలు కడుతుండే వారని నేడు ఎండాకాలం లో కూడా చెరువులు,కుంటలు, రిజర్వాయర్లు నిండు కుండాల మారాయని అన్నారు.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భూగర్భ జలాలు భారీగా పెరిగి 5 మీటర్ల పైకి నీరు  వచ్చిందన్నారు.  గంగ పుత్రులు, మృత్స కారులు,ముదిరాజ్ కులస్తుల కోసం 2016 -17 లో 45 చెరువుల్లో ఉచితంగా చేపలు వదిలే కార్యక్రమం చేపడితే నేడు జిల్లాలో 765 చెరువులల్లో చేప పిల్లలు ,రొయ్యలు వదులుతున్నట్లు తెలిపారు.  గతంలో ఉన్న సొసైటీలకు అదనంగా కొత్త సొసైటీలు స్థాపించేలా  ఆదాయము వారి సభ్యులకు దక్కేలా చూస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం చెరువులో 4 కోట్ల ఆదాయం లభిస్తుందని నాడు ఈ చెరువులో నీటి కోసం యజ్ఞంలు చేసే వారని,కృష్ణ నీటితో నింపాలని డిమాండ్ చేసే వారని,నేడు ఇబ్రహీంపట్నం చేరువుతో పాటు,రావిర్యాల చెరువు నిండి పంట  పొలాల్లోకి నీరు చేరిందన్నారు.


ప్రభుత్వం మృత్సకారులకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ.75 శాతం సబ్సిడీతో.. 900 కోట్లతో వాహనాలు సమకూర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కృషి చేస్తుందన్నారు...రకరకాల చేపల వంటకాలతో లబ్ది పొందుతున్నారని అన్నారు.ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను స్థానికులు సందర్శించి వంటకాలను ఆస్వాదించాలని అన్నారు.గతంలో 5 వేల టన్నుల మృత్స సంపద ఉత్పత్తి అయితే నేడు 9 వేల టన్నుల ఉత్పత్తి అవుతుందని,138 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి,  ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం,  జిల్లా ఫిషరీష్ అధికారి సుకృతి, అధికారులు, మృత్సకారులు,ప్రజలు పాల్గొన్నారు.

సరూర్ నగర్ - బొడ్రాయి పునః ప్రతిష్ట  కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా

మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ లో  చారిత్రాత్మకమైన  75 సంవత్సరాల అనంతరం జరుగుతున్న సరూర్ నగర్ - బొడ్రాయి పునః ప్రతిష్ట  కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: