తెలంగాణలో వైద్య రంగం అగ్రస్థానంలో

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి) 

జల్ పల్లి మున్సిపాలిటీలో  22వ వార్డు వాదీ హాదీస్ లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం లో వైద్య రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.అర్బన్ హెల్త్ సెంటర్లు,బస్తీ దవాఖానలతో పట్టణ పేద ప్రజల సుస్థిని నయం చేయటానికి దోహదపడుతున్నాయని అన్నారు.రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలు,పిహెచ్సిలు, అర్బన్ పిహెచ్సిలు, 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ఆరోగ్య తెలంగాణ కోసం  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారన్నారు.



మానవీయ కోణంలో ఆలోచించి కేసీఆర్ కిట్,అమ్మ వడి,న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నారని  తెలిపారు. మన ప్రాంతంలో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే గచ్చిబౌలిలో టీమ్స్ ఏర్పాటు అయిందన్నారు .ఈ సందర్భంగా మంత్రి  ప్రారంభించిన నూతన యూపిహెచ్సి లో  బీపీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ అబ్దుల్ బిన్ సాధి,  వైస్ చైర్మన్ ఫర్హా నాజ్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు,  స్థానిక కౌన్సిలర్ సౌద్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: