జల్ పల్లి మున్సిపాలిటీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ...
యంజాల అర్జున్ నియామకం
నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్యంజాల అర్జున్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లెల గూడా క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కీలకమైన జల్ పల్లి మున్సిపాలిటీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎంతో నమ్మకంతో ఇవ్వడం జరిగినదని, పార్టీలో ప్రముఖ భూమిక యూత్ దే ఉంటుంది కాబట్టి,,..
యువతను ఏకతాటిపై తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. నియామక పత్రం అందుకున్న అర్జున్ మంత్రికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. మంత్రి నామీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఇచ్చిన పదవికి వన్నెతెస్తూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ పార్టీ కొరకు శాయశక్తుల పని చేస్తానని తెలుపుతూ మంత్రి ఆశీర్వాదం
తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి మాజీ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, ప్రస్తుత జల్ పల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రం చారి, పరమేశం, బాలరాజు, ఆర్ .యాదయ్య, జగనరాజ్,, సిద్దు, యుత్ నాయకులు ఎస్,ఇద్రిస్, అను, జే. సందీప్, అశ్విన్ కుమార్, అక్బర్, సామ్ ఖాన్, మేరాజ్ పటేల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
జల్ పల్లి మున్సిపాలిటీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ... యంజాల అర్జున్ నియామకం ,,,,, నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: