శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో,,,,
బోనాల ఉత్సవాల్లో విషిష్ట సేవలను అందించిన ప్రముఖులకు
జులై మూడవ తేదీన అవార్డుల ప్రధానం
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జులై 3 వతేది సోమవారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో జరగనున్న కార్యక్రమంలో బోనాల ఉత్సవాల్లో విషిష్ట సేవలను అందించి పలువురు ప్రముఖులకు శ్రీమహాకాళి మహేష్ గౌడ్ బోనాల ఉత్సవ్ అవార్డ్స్ లను ప్రధానం చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు జి. అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు.
పాతబస్తీ లాల్దర్వాజాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు వంశపాఠ్యంపరంగా ఎందరో అమ్మవారి సేవలో నిమగ్నమై ఉంటారని వారిసేవలను గుర్తిస్తూ శ్రీ మహాకాళి మహేష్ గౌడ్ బోనాల ఉత్సవ్ అవార్డ్స్ ను ప్రధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు, కులవృత్తులవారికి, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, కళాకారులు, ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, నగరంలోని వివిధ దేవాలయాల అధ్యక్షులకు ఈ అవార్డులను ప్రధానం. చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి వైస్ చైర్మెన్ బండ ప్రకాష్, తెలంగాణ శాసన సభ డిప్యూటి స్పీకర్ టి. పద్మారావు, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్ధక సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,
రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సరస్వతీ ఉపాసకులు దైవాజ్ఞ శర్మ, ఎంఎల్సీ ఎంఎస్ ప్రభాకర్, టిఎస్ యూడబ్ల్యు సీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, సింహావాహిని మహాంకాళి దేవాలయం కమిటీ చైర్మెన్ సి. రాజేందర్ యాదవ్ తోపాటు పలువురు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రస్ట్ ప్రధానకార్యదర్శి కె. వెంకటేష్ లతోపాటు ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: