ఈటల రాజేందర్‌కు బీజేపీ ప్రచార సారథి బాధ్యతలు,,,
ఆ పార్టీ హైకమాండ్ యోచన
బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోంటోంది. ఇదిలావుంటే తెలంగాణ బీజేపీ పంచాయితీ హస్తినకు చేరింది. పార్టీలో నెలకొన్న పరిణామాలపై బీజేపీ అదిష్ఠానం ఫోకస్ చేసింది. అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఇవాళ సాయంత్రం ఈ ఇద్దరూ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఆయనకు కూడా పిలుపు రావటంతో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకొని హస్తినకు పయనమయ్యారు.
అయితే గతకొంతకాలంగా పార్టీ రాష్ట్ర నేతలపై ఈటల రాజేందర్, కోమటిరెడ్డి అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు బలం చేకూరుస్తూ.. ఇటీవల బీజేపీ నిర్వహించిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనటం లేదు. తెలంగాణ బీజేపీలో సముచిత స్థానం దక్కటం లేదని వారు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలిసింది. వీరిద్దరూ పార్టీని వీడబోతున్నారని.. కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి.. అసంతృప్త నేతలను బుజ్జగించే అంశంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నేతలు ఆరా తీశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ డీలా పడినట్లుగా కనిపిస్తోంది. పార్టీలోకి చేరికలు కూడా తగ్గాయి. పొంగులేటి, జూపల్లి పార్టీలోకి వస్తారని భావించినా.. వారు కాంగ్రెస్ పార్టీ వైపు మెుగ్గుచూపారు. కొత్తగా చేరే వారి సంగతి అటుంచితే.. పార్టీలో ఉన్న వారే చేజారి పరిస్థితులు వచ్చాయని కమలం పార్టీ భావిస్తోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈటల, కోమటిరెడ్డిలను హస్తినకు రావాలని ఆదేశించారు.
తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఈటలకు బీజేపీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రచార సారథి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయనకు ఢిల్లీ నుంచి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈటల సంగతి అటుంచితే కోమటిరెడ్డిని ఎలా సంతృప్త పరుస్తారనేది హాట్‌టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఆయన తిరిగి సొంతగూటికే చేరుతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ్టి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.
Home
Unlabelled
ఈటల రాజేందర్‌కు బీజేపీ ప్రచార సారథి బాధ్యతలు,,, ఆ పార్టీ హైకమాండ్ యోచన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: