బీఆర్ఎస్ నేతల ఇళ్లు...కార్యాలయాలపై ఐటీ దాడులు


బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ఈ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. కొండాపూర్ లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లోని కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. ఆయన కార్యాలయాలపై కూడా ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు నగరంలోని వివిధ రియలెస్టేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ లో కూడా రెయిడ్స్ జరుగుతున్నాయి. కేంద్ర బలగాల భద్రత మధ్య ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో... సోదాలు జరుగుతున్న ప్రాంతాలు, హైదరాబాద్ లోని ఐటీ కార్యాలయం వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: