స్త్రీ శక్తిని చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
స్త్రీ శక్తిని చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళాసాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు యత్నిస్తామన్నారు. వారి గౌరవాన్ని పెంపొందిస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన "తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అనేక మహిళ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.మహిళా సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గర్భిణులు, బాలింతల సంక్షేమానికి ‘‘కేసీఆర్ కిట్’’ పథకం కింద లబ్ధిదారులకు రూ. 12 వేలు అందిస్తూ, ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో వెయ్యి రూపాయలు అదనంగా కలిపి 13 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.ఈ పథకం కింద ఇప్పటి వరకు 13,90,639 మందికి 1261.67 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణ, పోషకాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన ‘‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’’ పథకం కింద గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను రేపటి నుండి మన జిల్లాలో కూడా అందించనున్నట్లు తెలిపారు.
మహిళల సంపూర్ణ రక్షణ కోసం, సామాజిక భద్రత కోసం దేశంలోనే ప్రప్రథమంగా షీ టీం లు ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.. గర్భిణులకు, బాలింతలకు, 6 సంవత్సరాల లోపు చిన్నారులకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో 35,700 అంగన్ వాడీల ద్వారా ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. వందల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 1,73,85,797 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారన్నారు. గర్భిణులకు ఆసుపత్రులకు వెళ్ళిరావడానికి అమ్మ ఒడి పేరుతో అమలు చేస్తున్న పథకం ద్వారా 22,19,504 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 166.19 కోట్లను ఖర్చు చేసిందన్నారు. నేటి వరకు ఆసరా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,52,050 మంది ఒంటరి మహిళలకు, 1,430 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెన్షన్‌గా చెల్లించిందన్నారు.
ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక చేయూతనందించి, వారి తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం ద్వారా రూ. 1,00,116లను ఆర్థిక సహాయంగా అందిస్తుందని, ఈ పథకం ద్వారా 13,03,818 మంది లబ్ధిదారులకు రూ. 11,775 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందించటం జరిగిందన్నారు. అంగన్ వాడీ వర్కర్ల నెలవారి వేతనాలను రూ. 4,200 నుండి 225 శాతం పెంచి నెలకు రూ. 13,650, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాలను రూ. 2,200 నుండి పెంచి నెలకు రూ. 7,800 లు, ఆశా వర్కర్ల వేతనాలు నెలకు రూ. 7,500 నుండి పెంచి నెలకు రూ. 9,750 లు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన మొత్తం 1003 రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, జనరల్ కేటగిరీకి చెందిన 3,03,820 మంది బాలికలుండగా, ప్రతీ విద్యార్థి కోసం ప్రభుత్వం ఏడాదికి సగటున రూ. 1,25,000 లు ఖర్చు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లను మహిళలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ, గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.750 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని, అభయహస్తం పథకం కింద రూ. 546 కోట్ల మహిళా సంఘాల మహిళా వికాసం పట్ల తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుందన్నారు. ఈ సందర్బంగా Rachakonda Commissionerate Women Safety & cyber stalking help line number 8712662662 ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డిజిపి అంజని కుమార్, ఎమ్యెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్ గుప్తా, ఎల్.బి.నగర్ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి, రాచకొండ కమిషనర్ డి. పి. చౌహాన్, సినీ నటులు ప్రియదర్శి, సినీ నటి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
స్త్రీ శక్తిని చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు,,,మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: