అంతర్ రాష్ట్ర కిడ్నాప్ ముఠా ఆరెస్ట్
నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి (ఐపీఎస్)
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా బేతంచెర్ల పోలీస్ స్టేషన్ నందు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బనగానపల్లెకు చెందిన సిహెచ్.వినాయక రెడ్డి.భరత్ కుమార్ రెడ్డి.డ్రైవరు సాయినాథ్ రెడ్డి లను కిడ్నాప్ చేశామని నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే వదిలిపెడతామని నాగిరెడ్డి కి కిడ్నాపర్స్ తెలపడంతో భయపడిన నాగిరెడ్డి తనకు తెలిసిన వారి వద్ద నుండి 4 కోట్లు డబ్బులు జమ చేసుకొని తన మేనల్లుడు శంకర్ రెడ్డి ద్వారా రెండు విడతలుగా అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి వద్ద మరియు కర్నాటక రాష్ట్రము కోలార్ జిల్లా వద్ద కిడ్నాపర్స్ కు 4 కోట్ల రూపాయలు ఇచ్చినా కిడ్నాపర్స్ తన వాళ్ళను విడిచి పెట్టలేదని బేతంచెర్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా బేతంచర్ల పోలీస్ స్టేషన్ నందు CR No. 108/2023 U/Sec 342, 364-A, 386 r/w 34 IPC గా కేసు నమోదు చేయగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి కేసును చాలెంజ్ గా తీసుకొని దర్యాప్తులో భాగంగా నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ జీ.వెంకట రాముడు మరియు డోన్ డిఎస్పి వై.శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో, బేతంచెర్ల సిఐ జి.ప్రియతమ్ రెడ్డి, ఎస్సై ఎస్.శివ శంకర్ నాయక్,ప్యాపిలి ఎస్సై సీఎం.రాకేశ్, ఎస్సైలు ఎం.నరేశ్, కె.జగదీశ్వర రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్సై డి.రమేశ్ రెడ్డి, ఎస్బి ఎస్ఐ కే.ఎన్.హరినాథ రెడ్డి మరియు పోలీసు సిబ్బందితో మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి డోన్ డిఎస్‌పి పర్యవేక్షణలో అదునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనంతపురం, బాగేపల్లి, చిక్బల్లాపూర్, బెంగుళూరు, కోలార్, మైసూరు, తుమ్కూర్ మొదలగు ప్రదేశాలలో
తిరిగి కిడ్నాపర్స్ కోసము ముమ్మర గాలింపులు జరుపుతుండగా 29.06.2023 గుత్తి మండలము బాట సుంకులమ్మ గుడి వద్ద సురేశ్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా చేసిన నేరము ఒప్పుకొని మిగిలిన ముద్దాయిల సమాచారం తెలపడంతో అనంతపురము జిల్లా చెన్నేకొత్తపల్లి మండలము, కోన మల్లికార్జునస్వామి గుడికి వెళ్ళు రహదారిలో కర్నాటక రాష్ట్రనికి చెందిన శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, జి.ఎన్. రంజిత్ కుమార్ లను ఆంద్ర రాష్ట్రము లోని ఉమ్మడి అనంతపురం జిల్లాకి చెందిన రవి కుమార్,రంజిత్ కుమార్ లను అదుపులోనికి తీసుకొని విచారించగ నేరమును అంగీకరించగా, వారి వద్ద నుండి 40 లక్షల రూపాయల నగదును, నాలుగు కార్లను, మూడు సెల్ ఫోన్ లను మరియు ఒక కత్తిని స్వాదీనము చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఈ కేసులో ముద్దాయిలు కేవలము తాము త్వరగా ఆర్ధికముగా స్తిరపడాలనే ఉద్దేశ్యముతో ధనవంతుడైన బనగానపల్లే కు చెందిన వినాయక రెడ్డిని ఎంచుకొని అతని ఇంటి వద్ద రెక్కి నిర్వహించి పక్క పధకం ప్రకారము 05.06.2023 న వినాయక రెడ్డి సొంత వాహనములో బేతంచెర్ల వైపు వెళ్లడం గమనించి,తాము ముందుగా అనుకున్న పధకం ప్రకారము బేతంచెర్ల మండలము సీతరామపురం మెట్ట దాటిన తరువాత తమ వాహనాలతో అడ్డగించి వినాయక రెడ్డి,కుమారుడు భరత్ కుమార్ రెడ్డి లను మరియు డ్రైవరు సాయినాథ్ రెడ్డి ని కూడా కిడ్నాప్ చేశారని తెలిపారు.ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని చేదించిన డోన్ డిఎస్పి వై.శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో విధులు నిర్వహించిన బేతంచెర్ల సిఐ జి.ప్రియతమ్ రెడ్డి, ఎస్ఐ ఎస్.శివశంకర్ నాయక్, ప్యాపిలి ఎస్సై సీఎం.రాకేశ్, ఎస్సైలు యం.నరేశ్, కె.జగదీశ్వర రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్సై డి. రమేశ్ రెడ్డి,ఎస్బి ఎస్ఐ కే.ఎన్. హరినాథ రెడ్డి పోలీసు సిబ్బంది దస్తగిరి, గురుబాబు, శ్రీకాంత్, రాజ, భాస్కర్, సురేష్, చిన్న వెంకటేశ్వర్లు, హెచ్జీ విశ్వేశ్వరయ్య, జాకీర్, ఐటి కోర్ టీం మధు, శేఖర్ లను జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి అభినందించారు.
Home
Unlabelled
అంతర్ రాష్ట్ర కిడ్నాప్ ముఠా ఆరెస్ట్.... నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి (ఐపీఎస్)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: