బోనాల ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం అందించండి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను  కోరిన  శ్రీ మహంకాళి దేవాలయ నూతన ఆలయ కమిటీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్  ప్రతినిధి)

లాల్ దేర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ నూతన ఆలయ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆలయ చైర్ మెన్ సి రాజేందర్ యాదవ్ మంత్రికి పుష్ప గుచ్చం ఇచ్చి  శాలువాతో సత్కరించారు. ఆలయ జనరల్ సెక్రటరీ మారుతీ యాదవ్,,కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్,  ఢిల్లీ కన్వినర్ జి అరవింద్ కుమార్ గౌడ్ మంత్రిగని శాలువాతో సత్కరించారు. రానున్న బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తీ సహకారం అందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు రాజు యాదవ్, విష్ణు గౌడ్, సి రాజ్ కుమార్ యాదవ్, సీర రాజ్ కుమార్ , పోసాని సురేందర్ ముదిరాజ్, కే వెంకటేష్,  కమిటీ సభ్యులు సతీష్ ముదిరాజ్, వినోద్ , చందు , టోనీ యాదవ్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: