జల్ పల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను,,,,
సందర్శించిన మంత్రి సబితాఇంద్రా రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్ పల్లి మున్సిపాలిటీలో జల్ పల్లి లో ఉన్న అర్బన్ ఫారెస్ట్ పార్కును తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఆ ఫారెస్ట్ కు చెందిన పార్కుకు సంబంధించి అభివృద్ధి, వాకింగ్ ట్రాకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. జల్ పల్లి అర్బన్ పార్క్ లో ఉదయం సాయంత్రం స్థానికులు వాకింగ్ చేసేలా తీర్చిదిద్దనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం నాడు మంత్రి మునిసిపల్ చైర్మన్ అబ్దుల్ బిన్ సాధి, మునిసిపల్ కమిషనర్ వసంత, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు యూసుఫ్ పటేల్, ఖలీఫా, శంషాద్దీన్, తదితరులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా అర్బన్ పార్క్ లో కాలిబాటన తిరుగుతూ చేపట్టాల్సిన పనులపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అర్బన్ పార్క్ లో మునిసిపల్ తరుపున సిబ్బందిగా ఒకరిని నియమించాలని, చిన్న పిల్లలు ఆటలు ఆడుకునేలా పరికరాలు ఏర్పాటు చేస్తాం అన్నారు.
Home
Unlabelled
జల్ పల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను,,,, సందర్శించిన మంత్రి సబితాఇంద్రా రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: