కొత్తగుడెం నుంచి పోటీ చేస్తా.... హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు 

వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయనప్రకటించారు. రాజకీయ ప్రవేశంపై డీహెచ్ శనివారం స్పష్టతనిచ్చారు. కొత్తగూడెం శ్రీనగర్‌ కాలనీలోని జనహితం కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఆలోచన లేదని వివరించారు. 

కొత్తగూడెంలో ఉపాధి అవకాశాలు లేక చాలామంది హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని గుర్తుచేశారు. ఈ విషయంపై నియోజకవర్గ ప్రజలకు శ్రీనివాసరావు ఓ బహిరంగ లేఖ రాశారు. ప్రజల కోసం గడల శ్రీనివాసరావు (జీఎస్ఆర్) ట్రస్టు ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉచిత వైద్య సేవల ద్వారా శ్రీనివాసరావు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్ఆర్‌ ట్రస్టు నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ట్రామా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డాక్టర్‌గా పేషెంట్లకు సేవలందిస్తున్నానని.. ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నానని శ్రీనివాసరావు తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: