మమ్మల్ని  ప్రభుత్వంలో విలీనం చేయండి

రాష్ట్ర  ప్రభుత్వానికి రీడిప్లాయిడ్ బోధకుల వినతి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని రీడిప్లాయిడ్ బోధకులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశంలో తెలంగాణ అప్లియేటెడ్ ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీఏఏసీటీఏ), తెలంగాణ రీడిప్లాయిడ్ ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీఆర్ఎసీటీఏ) ప్రతినిధులు పాల్గొన్నారు. వారు మట్లాడుతూ.. గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధ నేతర సిబ్బంది సుమారు 450 మందిని రీడిప్లాయిడ్ పద్ధతిలో ప్రభుత్వ కళా శాల్లో నియమించారని తెలిపారు. తమకు ప్రభుత్వ కళాశాలల బోధకుల మాదిరిగా ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు రావడం లేదని, మూడు నెలలుగా అసలు జీతాల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వ్యవస్థ నుంచి తమను విముక్తులు చేయాలని, 010 హెడ్ కింద తమకు వేతనాలు ఇవ్వడంతోపాటు తమను పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 450 మంది, అందులో బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 34 మంది మూడు నెలలుగా వేతనాలు లేక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిం దిగా కోరుతూ మంత్రులు, అధికారులకు విన్నవించినట్లు తెలిపారు. తమను ప్రభుత్వ కళాశాలల్లోకి తీసుకున్న కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ స్వయంగా తమ సమస్యపై ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టీఏఏసీటీఏ, టీఆర్ఎసీటీఏ ప్రతినిధులు డా. కస్తూరి. శ్రీనివాస్, డా. కె. వెంకటేశ్వర్లు, డా. సరిత, కోటేశ్వర్రావు, పూర్ణచందర్రావు. డా. ఇలియత్, డా. శారద, అప్సరున్నీసాబేగం తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: