రానున్నకాలంలో తుక్కుగూడ ప్రాంతం ఊహించని విధంగా మారనుంది
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యాక్స్ కాన్ ల రాకతో రానున్నకాలంలో తుక్కుగూడ ప్రాంతం ఊహించని విధంగా మారనుందని,ఎయిర్పోర్ట్ వరకు నిర్మించనున్న మెట్రో రైలును ఇక్కడి వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొరనున్నట్లు మంత్రి తెలిపారు. తుక్కుగూడ లో మునిసిపాలిటీ 13, 14, 15 వ వార్డులలో ఒక కోటి 60 లక్షల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...తుక్కుగూడ గ్రామానికి ప్రతీకగా నిలిచే బురుజు అభివృద్ధికి 25 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేసినట్లు,అదే విధంగా బతుకమ్మ ఘాట్ పనులకు శ్రీకారం చుట్టినట్లు,రెండింటికి ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
9 ఏళ్లలో కాలంలో తుక్కుగూడ అభివృద్ధిని సమీక్షించి, రానున్న కాలంలో చేయాల్సిన వాటికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. తుక్కుగూడ మునిసిపాలిటీలో ఇప్పటివరకు 50 కోట్లు తాగునీటికి నిధులు మంజూరు చేసినట్లు,పనులు కొనసాగుతున్నాయని అన్నారు. తుక్కుగూడలో రోడ్ల వెడల్పుకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ కృషితో లైట్ల నిర్మాణానికి 5 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. ఇప్పటికే తుక్కుగూడ ప్రాంతంలో 58 కంపెనీలు వచ్చాయని, మరో 9 నెలల్లో ఫాక్స్ కాన్ సంస్థ నిర్మాణం పూర్తి అవుతుందని,ఈ ప్రాంతంలో లక్షకు పైగా ఉద్యోగులు రానున్నారని,స్థానికులకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు.అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు లాగా ప్రభుత్వం ముందుకెళ్తుందని,కుల,చేతి వృత్తుల వారికి లక్ష రూపాయలు అందించటానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ఈ పథకం తీసుకువచ్చారన్నారు. ఇప్పటికే గొల్ల కురుమ సోదరులకు గొర్రెలు ఇస్తూ, రజక, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Home
Unlabelled
రానున్నకాలంలో తుక్కుగూడ ప్రాంతం ఊహించని విధంగా మారనుంది,,, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: