లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని
దర్శించుకొన్న బండ్లగూడా తహశీల్ధార్ చంద్రకళ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని బండ్లగూడా తహశీల్ధార్ చంద్రకళ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సి. రాజేందర్ యాదవ్ తహశీల్ధార్ చంద్రకళను ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ జనరల్ సెక్రటరీ మారుతీ యాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్, మాజీ చైర్మన్లు జగదీష్ ముదిరాజ్, కాశి నాథ్ గౌడ్, విష్ణు గౌడ్, కమిటీ సభ్యులు సతీష్, సాయినాథ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: