అన్ని కులాల వారి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి
వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం
"బ్రాహ్మణ భవన్" కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
బడంగ్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కురుమలగూడ లో "బ్రాహ్మణ భవన్" కు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనచేశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, 9 ఎకరాల్లో 12 కోట్లతో నిర్మించిన బ్రాహ్మణ భవనాన్ని ఇటీవలే ప్రారంభించుకున్నామని, 15 రోజుల వ్యవధిలోనే మహేశ్వరం లో భూమి పూజ చేయటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అన్ని కులాల వారి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి సముచిత గౌరవం కల్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మహేశ్వరంలో బ్రహ్మణ భవనం పనులు త్వరితగతిన పూర్తి చేసుకొని అందుబాటులోకి తెస్తాం అన్నారు.
వేద, శాస్త్ర పండితుల గౌరవ వేతన భృతి రూ. 2500 నుండి రూ. 5000 కు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా వేద, శాస్త్ర పండితుల గౌరవ భృతి పొందే అర్హత వయస్సు 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గించినట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో అతి పురాతన,ప్రాచీన దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేలా సుమారు 8 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగరం పరిధిలో అన్ని ఆలయాలకు ధూప దీప నైవేద్యము నిత్యం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఐఐటీ, ఐఐఎం లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయాంబర్స్ మెంట్ పథకం వర్తింప చేస్తున్నాం అన్నారు..
సంస్కృత కవి, వ్యాఖ్యాత కొలచల మల్లినాథ సూరి పేరున రాష్ట్రంలోనే తొలి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని మెదక్ లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారన్నారని ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, కార్పొరేటర్లు, బ్రాహ్మణ సంఘాల నాయకులు అరవింద్ శర్మ, ప్రమోద్, మాధవి, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
Home
Unlabelled
అన్ని కులాల వారి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి,,,, వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం ,,,, "బ్రాహ్మణ భవన్" కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: