కళ్యాణాలక్మి, షాది ముబారక్ పథకాలు.... 

పేదింటి అడబిడ్డల వివాహాలకు కొండంత అండ

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

కళ్యాణాలక్మి, షాది ముబారక్ పథకాలతో పేదింటి అడబిడ్డల వివాహాలకు కొండంత అండగా ఉంటుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు మహేశ్వరం లో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణాలక్మి చెక్కులను అందజేసారు.నూతన జంటలకు శుభాకాంక్షలు తెల్పిన మంత్రి మాట్లాడుతూ ఒక మేన మామ లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష రూపాయల సహాయం అందిస్తున్నారన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: