ఢిల్లీలో సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ బోనాల జాతర
జాతీయ జెండా ఊపి... ప్రారంభించిన గౌరవ్ ఉత్పల్...సి.రాజేందర్ యాదవ్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఢిల్లీ బోనాల జాతరను ఈ రోజు దేశ రాజధాని ఇండియా గేట్ వద్ద రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉత్పల్, ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్ జాతీయ జండా ను ఊపి జాతరకు శ్రీకారం పలికారు. తెలంగాణ భవన్ వరకు కళాకారుల ప్రదర్శన, నృత్యాలతో ఢిల్లీ వీధులలో తెలంగాణ సంస్కృతి కండ్లకు కట్టి నట్టుగా చూపించారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉత్పల్ (ఐఏఎస్) అమ్మవారి ఘటముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మారుతీ యాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్, ఢిల్లీ బోనాల కన్వినర్ అరవింద్ గౌడ్, మాజీ చైర్మన్ లు విజయ్ కుమార్ ,కాశీనాథ్ గౌడ్, సి.వెంకటేష్, మానిక్ గౌడ్, రాజ్ కుమార్ యాదవ్, లక్ష్మి నారాయణ్ గౌడ్, పోసాని సురేందర్ ముదిరాజ్, కే వెంకటేష్ సభ్యులు రమేష్ ,హేమానంద్, సుధాకర్, వినోద్ రగు యాదవ్, చందు, నగేష్ గౌడ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఢిల్లీలో సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ బోనాల జాతర ,,,,,జాతీయ జెండా ఊపి... ప్రారంభించిన గౌరవ్ ఉత్పల్...సి.రాజేందర్ యాదవ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: