జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి....,యాక్సిడెంట్‌పై షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్
ప్రజలను చైతన్యవంతచేసే కార్యక్రమాల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముందుంటారు. ఇదిలావుంటే రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు చాలా మంది అజాగ్రత్తగా ఉంటారు. ట్రాఫిక్ రూల్స్ ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారు. ఓవర్‌టెక్, స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లో చేస్తూ.. ప్రమాదాలకు కారణమవుతారు. ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా.. అవేవీ పట్టించుకోకుండా దూసుకెళ్లిపోతారు. అలాంటి డేంజర్ డ్రైవింగ్ కారణంగా వారు నష్టపోవటమే కాదు.. సవ్యంగా వెళ్లే మిగతా వాహనాదారులను కూడా ప్రమాదాలకు గురయ్యేలా చేస్తున్నారు. అలా ఓ అమ్మాయి రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓ యువకుడి ఓవర్ స్పీడ్ కారణంగా సవ్యంగా వెళ్తున్న మరో వాహనదారుడు గాయపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియోను సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఆ వీడియోలో ఓ అమ్మాయి రోడ్డు క్రాస్ చేసేందుకు స్కూటీపై రాంగ్‌రూట్‌లో వెళ్లింది. అంతలో వారికి ఎదురుగా ఇద్దరు యువకులు తమ తమ బైకులపై వస్తున్నారు. అందులో ఓ యువకుడు స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. రాంగ్‌రూట్‌లో సడెన్‌గా ఎదురొచ్చిన ఆ అమ్మాయిని తప్పించబోయి.. ఓ యువకుడు రోడ్డు పక్కనే ఓ షాపు ముందు ఉన్న మెట్లను ఢీకొట్టాడు. అంతే అమాంతం బైక్‌తో సహా గాల్లోకి ఎగిరిపడ్డాడు. వెనుక నుంచి సవ్యంగా వస్తున్న మరో యువకుడి బైకుపై యాక్సిడెంట్‌కు గురైన బైక్ పడింది. దీంతో ఆ ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అ అమ్మాయి నిర్లక్ష్యంగా రాంగ్‌రూట్‌లో రావటం, యువకుడు కంట్రోల్ అయ్యే అవకాశం లేనంతగా బైక్‌ను స్పీడ్‌గా డ్రైవ్ చేయటం ప్రమాదానికి కారణమైంది.
ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉన్న ఆ షాకింగ్ వీడియోను ట్వీట్ చేసిన సజ్జనార్.. 'యూటర్న్‌ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం డేంజర్ ! మీతో పాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారు. జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.' అని సూచించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలను ఆయన పేర్కొనలేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సజ్జనార్.. టీఎస్‌ఆర్టీసీ కార్మికులు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు అభినందిస్తారు. అలాగే సమాజంలో జరిగే మోసాలు, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేదానిపై సూచనలు ఇస్తారు. అలాగే ఇలాంటి వీడియోలు షేర్ చేసి వాహనదారుల్లో అవగాహన కల్పిస్తుంటారు.
Home
Unlabelled
జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి....,యాక్సిడెంట్‌పై షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: