సంక్షేమాల సంబురం  మనది......దేశానికి అబ్బురపరుస్తుంది...

కేసీఆర్ మార్క్ పాలనకు నిదర్శనం,,,.తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం  నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ కిన్నెర గ్రాండ్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా  సంక్షేమ సంబరాల  సందర్భంగా  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,ఆసరా పెన్షన్ల ,లబ్ధిదారులతో  జరిగిన కార్యక్రమంలో  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...తెలంగాణలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదు....  కేసీఆర్ సంక్షేమ పథకం అందని గడప ఉండదన్నారు...

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రం గా తెలంగాణ నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ స్వర్ణయుగం నడుడ్తుందని... 200 రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్లు 2 వేలకు పెంచి గతంలో 20 లక్షల మందికి అందేవని,నేడు 44 లక్షల మందికి ఇప్పటివరకు 58 వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు.

కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణీలకు ప్రభుత్వం  తల్లి గారింటి పాత్ర పోషిస్తుందని,ప్రస్తుతం రక్త హీనత సమస్య రూపుమాపేందుకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చూడుతున్నట్లు, ఇప్పటివరకు 13 లక్షల 91 వేల మందికి కేసీఆర్ కిట్లు అందించినట్లు,ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మాయి పుడితే 13 వేలు,అబ్బాయి పుడితే 12 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.

  1200 ఉచిత విద్య అందించాలనే గురుకులాలు స్థాపించి అందులో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా ఒక్కొక్కరి మీద లక్ష 20 వేలు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు.  12 లక్షల 69 వేల మందికి 11  వేల కోట్లు కళ్యాణాలక్ష్మి,షాది ముబారక్ ద్వారా అందించినట్లు తెలిపారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పూర్తి పారదర్శకంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున,38,323 మందికి దళిత బంధు ద్వారా సహాయం అందిందని అన్నారు.


సకల జనుల సర్వే లో 6 లక్షల 30 వేల కుటుంబాలు గొర్రెల పెంపకం దారులు ఉన్నట్లు గుర్తించి,మొదటి విడతలో  3 లక్షల మందికి రెండవ విడతలో మిగతవారికి సబ్సిడీ మీద గొర్రెలు పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారన్నారు.  తెలంగాణ రాక ముందు నిరాదరణకు గురి అయిన కుల,చేతి వృత్తుల వారికి లక్ష రూపాయలు పొందటానికి ఎలాంటి పైరవి లేకుండా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొవాలన్నారు. కుల,చేతి వృత్తులకు సంభందించి 9 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేసారు. సరూర్ నగర్ స్వయం సహాయక సంఘానికి ఒక కోటి 25 లక్షల రూపాయల రుణాల చెక్కును అందజేసారు. షాది ముబారక్ కింద మంజూరు అయిన చెక్కులను 31 మందికి పంపిణీ చేసి,నూతన జంటలను అభినందించారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: