బీఆర్ఎస్ లో చేరుతానని గతంలో బండి సంజయ్ నాతో చెప్పారు: రవీందర్ సింగ్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ నేత, కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో చేరుతానని తనతో సంజయ్ చెప్పారని అన్నారు. కేసీఆర్ తో కలిపించాలని, పార్టీలో చేరికపై ఆయనతో స్వయంగా తానే మాట్లాడతానని చెప్పారని వెల్లడించారు.
గతంలో బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన బండి సంజయ్ ఇప్పుడు కేసీఆర్ ను విమర్శించడం సరికాదని అన్నారు. ఇకపై నోరు జారితే బాగుండదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును చూసి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే.. సంజయ్ మాత్రం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అభివృద్ధి కేంద్రంలోని బీజేపీకి కనిపిస్తోందని... ఇక్కడున్న బీజేపీ నేతలకు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు.
Home
Unlabelled
బీఆర్ఎస్ లో చేరుతానని గతంలో బండి సంజయ్ నాతో చెప్పారు: రవీందర్ సింగ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: