నీకంటే పెద్ద మొగోడిని.. పవన్ కల్యాణ్ కు చెప్పులు చూపిస్తూ..చెలరేగిపోయిన పేర్ని నాని

జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపిస్తూ మండిపడ్డారు. నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే నీకంటే పెద్ద మొగోడిని కాబట్టి నేను రెండు చెప్పులు చూపిస్తున్నానని, మక్కెలిరిగిపోతాయని పవన్ కల్యాణ్ ను హెచ్చరించారు. గతంలో జనసేన పార్టీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ చెప్పు చూపించి వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా పేర్ని నాని తాజాగా రెండు చెప్పులు చూపిస్తూ హెచ్చరించారు.

 ప్రజలను నమ్ముకుంటే మాత్రమే అసెంబ్లీలోకి వెళతారని, వ్యూహాలను, చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరని పేర్ని నాని హితవు పలికారు. ఓవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుని అదే సమయంలో టీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పారంటూ పవన్ కల్యాణ్ పై పేర్ని నాని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పాట పాడుతూ, ఏపీలోకి రాగానే పవన్ కల్యాణ్ తెలంగాణ నేతలపై విమర్శల పాటపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఏపీలో తన సినిమాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపైనా పేర్ని నాని స్పందించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పవన్ తీసిన సినిమాలు రెండు మాత్రమేనని, సినిమా బాగుంటే తప్పకుండా ఆడతాయని చెప్పారు.

అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి ఎన్ని వ్యూహాలైనా పన్నుతానంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ పేర్ని నాని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషిస్తానన్న పవన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. గోదానం, భూదానం తరహాలో ముఖ్యమంత్రి పదవి కూడా దానం చేస్తారా అని ప్రశ్నించారు. ‘ఏదీ తనకు తానుగా నీ దరికి రాదు.. శోధించి సాధించాలి‘ అన్న శ్రీశ్రీ కొటేషన్ ను ప్రస్తావిస్తూ జగన్ శోధించి సీఎం పదవిని సాధిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం అడుక్కుంటున్నాడని పేర్ని నాని విమర్శించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: