సమాజ సేవలో రెడ్ క్రాస్ సొసైటీ  పాత్ర ఎంతో గొప్పది

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాుటు చేసిన ఉచిత వృద్ధులు సంచార వైద్య వాహనాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. సరూర్ నగర్ వార్డు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచార అంబులెన్స్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను అభినందించారు.  సమాజ సేవలో రెడ్ క్రాస్ సొసైటీ  పాత్ర ఎంతో గొప్పదని,  ప్రచారాలకు దూరంగా సేవే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి స్వచ్ఛంద సంస్థల సేవలు చేస్తున్న వారికి ప్రభుత్వం పరంగా ఎలాంటి సహకారం కావాలన్నా అందివ్వాలని పిలుపునిచ్చారన్నారు.  ఈ సంచార వైద్యశాలతో పేద వయో వృద్ధులకు ఇంటి వద్దనే వైద్యం అందుతుందన్నారు. 
 సరూర్ నగర్ జూనియర్ కళాశాలలోని అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి


సరూర్ నగర్ జూనియర్ కళాశాలలో రెండు కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం నాడు పరిశీలించారు.ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: