రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్ జరిగిన తెలంగాణ సాగునీటి  దినోత్సవంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....కాలేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు తీసుకువస్తామని అన్నారు..కృష్ణా బ్యాక్ వాటర్ తో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు కోర్టులలో కేసులు వేస్తూన్న అటు న్యాయ పోరాటం చేస్తూ, మరో వైపు కేంద్రం ద్వారా  కృషి చేస్తున్నామన్నారు. గోదావరిలో 32 టీఎంసీ లు కృష్ణాలో  23 టీఎంసీ ల నీటితో ఆయా ప్రాంతాల్లో రిజర్వాయర్లు కట్టుకొని తాగునీటిని ప్రభుత్వం అందిస్తుందన్నారు.



ముందు డ్రింకింగ్ వాటర్ ను తీసుకువచ్చి అనంతరం సాగునీటిని తెచ్చి  రంగారెడ్డి జిల్లాను  సస్యశ్యామలం చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల కాలంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన అయిన కాలేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని అన్నారు.  గతంలో 2014 కు ముందు రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని, మన రాష్ట్రం పంజాబ్ ను దాటిందన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో జలకళ సంతరించుకుందని,భూగర్భ జలాలు పెరిగి, బోర్లలో నీరు పుష్కలంగాఉందని, పశువులకు నీరు లభిస్తుందని అన్నారు.

గతంలో ఎన్నడులేనివిధంగా చెరువుల్లో చేపలు వదులుతూ మృత్సకారులకు, ముదిరాజ్ కులస్తులకు ఆర్థికంగా లబ్ది చేకూరుతుందన్నారు. గతంలో మన జిల్లాలో చెక్ డ్యాంలు నిషేధం ఉండగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్  చెక్ డ్యాంలు కట్టడానికి అనుమతి ఇవ్వటంతో వాటిలో నీటి నిల్వతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణలో ఏ రంగం  వెనుక బడిందో,ప్రజలకు ఎం చేయాలో ఆలోచించి,ఉద్యమ నాయకులే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలు మెచ్చిన పాలన కొనసాగిస్తున్నారన్నారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ అనే పదం పలుకటానికి కూడా నాయకులు జంకే వారని, తమ రాజకీయ జీవితం ఎక్కడ అంధకారంలోకి వెళ్తుందని భయపడేవారని కానీ నేడు స్వరాష్ట్రం లో తెలంగాణ యాసలో సినిమా తీసినా, తెలంగాణ బిడ్డలు హీరోలుగా నటించిన ప్రజాధారణ పొందుతున్నాయని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రతి ఎకరాల్లో ఏ పంట వేసుకుంటున్నారో అనే  లెక్క ప్రభుత్వం వద్ద ఉందని, రైతులకు రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారన్నారు.

బంగారు తెలంగాణ అంటే, అందరికి బంగారం ఇవ్వటం కాదని, బంగారు పూత పూయటం కాదని ప్రజలు బాగుపడాలని,ప్రజల బతుకుల్లో మార్పు రావాలని, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు,రైతు బంధు,రైతు భీమా లాంటి రైతు సంక్షేమం, ఉద్యోగుల జీతాలు పెంచి,నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ,కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రజలకు పాలన దగ్గరికి తీసుకువెళ్లాలని నూతన గ్రామ పంచాయతీలు,మండలాలు,రెవిన్యూ డివిజన్లు, నూతన జిల్లాలు,జోన్లు, నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు సకల రంగాల అభివృద్ధి చేయటమే బంగారు తెలంగాణ నిర్మాణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయనంద్, ఎంపీపీ రఘుమా రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి,  వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు,పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: