బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం,,,బిల్డింగ్ పైనుంచి దూకిన ఇంటర్ విద్యార్థి
కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్తుల బలార్మణ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇదిలావుంటే మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కాలేజీ భవనం పైనుంచి దూకి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కామరెడ్డికి చెందిన రాగుల వంశిత (16) అనే విద్యార్థినిని వారం క్రితం నారాయణ కలశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో తల్లిదండ్రులు జాయిన్ చేశారు. అప్పటి నుంచి కాలేజీ హాస్టల్‌లోనే ఉంటుంది. అయితే ఇవాళ ఉదయం ఆమె.. అనుమానస్పదస్థితిలో కాలేజీ బల్డింగ్ పైనుంచి దూకి చనిపోయింది. దీంతో కళాశాల యాజమాన్యం వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిత బిల్డింగ్ పైనుంచి దూకిందా ? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలేజీ యాజమాన్యం ఏమైనా వేధింపులకు గురి చేసిందా ? అన్న యాంగిల్‌లోనూ విచారణ జరపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఇంటర్ స్టూడెంట్‌పై చేయి చేసుకున్న ఎస్సై
ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ శివారులోని నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలోనూ ఓ ఇంటర్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక.. సాత్విక్ అనే విద్యార్తి ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలో అప్పట్లో సంచలనం సృష్టించింది. కాలేజీలో నలుగురు లెక్చరర్ల వేధింపులు, ఒత్తడి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ విద్యార్థి సూసైడ్ నోట్ రాశాడు. విద్యార్థి ఆత్మహత్యపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ నివేదిక ఆధారంగా యాజమాన్యంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. నలుగురు లెక్చరర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది. సాత్విక్ ఘటన మరువక ముందే మరో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందటం కలకలం రేపుతోంది.
Home
Unlabelled
బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం,,,బిల్డింగ్ పైనుంచి దూకిన ఇంటర్ విద్యార్థి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: