రానున్న కాలంలో తుక్కుగూడ ప్రాంతంలో,,,,

ఊహించని విధంగా ప్రగతి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

రానున్న కాలంలో తుక్కుగూడ ప్రాంతం ఊహించని విధంగా పురోగతి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇదిలవుంటే తుక్కుగూడ లో  మునిసిపాలిటీలోని  10 వ వార్డులో సుమారు ఒక కోటి రూపాయల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేశారు. 10 వార్డులో 25 లక్షల రూపాయలతో వైన్స్ వెనుక భవాని బుచ్చిరెడ్డి ఇంటి నుండి చికెన్ రాజు ఇంటి వరకు పోసాని ప్రభాకర్ ఇంటి వరకు  సీసీ రోడ్లు నిర్మాణానికి,


10 వార్డులోనే మరో 10 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నుండి కృష్ణారెడ్డి ఇంటి వరకు మరియు దానయ్య ఇంటి వరకు   సిసి రోడ్డు నిర్మాణం,ముక్త కంచె తాండాలో ఎం పృధ్విరాజ్ ఇంటి నుండి గోపాల్ ఇంటి వరకు 7 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, ముక్త కంచే తండా నుండి భూదేవమ్మ గుడి వరకు 25 లక్షలతో చేపట్టే ఆర్మ్ లైటింగ్ పనులకు, ప్రైమరీ స్కూల్ పక్కన నుండి రెడ్యా ఇంటి వరకు మరియు కృష్ణ ఇంటి గుండా 8 లక్షలతో కనెక్టింగ్ రోడ్డు సీసీ రోడ్ల నిర్మాణం కొరకు  శంకుస్థాపన, ప్రైమరీ స్కూల్ ప్రక్కన అభిలాష్  ఇంటి వరకు గేమ్య ఇంటి గుండా దొంత్రమౌని చంద్రయ్య గృహము మరియు మహేష్ ఇంటి వరకు 10 లక్షలతో  సీసీ రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అదేవిధంగా మహంకాళి అమ్మవారి గుడి దగ్గర 10 లక్షలతో చేపట్టే  సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...ఫ్యాబ్ సిటీ,  ఫార్మా సిటీ, ఫ్యాక్స్ కాన్ ల రాకతో రానున్న కాలంలో తుక్కుగూడ ప్రాంతం ఊహించని విధంగా మారనుందని,ఎయిర్పోర్ట్ వరకు నిర్మించనున్న మెట్రో రైలును ఇక్కడి వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. తుక్కుగూడ మునిసిపాలిటీకి ఇటీవలి మహేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 25 కోట్ల నిధులు కేటాయించడం గొప్ప విషయం అని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.


ప్రజల అవసరాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు.తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 9 ఏళ్లలో కాలంలో  తుక్కుగూడలో జరిగిన అభివృద్ధిని సమీక్షించి, రానున్న కాలంలో చేయాల్సిన వాటికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.తుక్కుగూడ మునిసిపాలిటీలో ఇప్పటివరకు 50 కోట్లు తాగునీటికి నిధులు మంజూరు చేసినట్లు,పనులు కొనసాగుతున్నాయని అన్నారు.తుక్కుగూడలో రోడ్ల వెడల్పుకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.కేటీఆర్ గారి కృషితో లైట్ల నిర్మాణానికి 5 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయన్నారు.


ఇప్పటికే తుక్కుగూడ ప్రాంతంలో 58 కంపెనీలు వచ్చాయని, మరో 9 నెలల్లో ఫాక్స్ కాన్ సంస్థ నిర్మాణం పూర్తి అవుతుందని,ఈ ప్రాంతంలో లక్షకు పైగా ఉద్యోగులు రానున్నారని,స్థానికులకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు.రానున్న కాలంలో ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీగా కానుందన్నారు.అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు లాగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు.

 










Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: