తెలంగాణ ఉద్యమ అమరవీరునికి సముచితమైన గౌరవం....
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా మైదానానికి సిరిపురం యాదయ్య పేరు...
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనతో ఉత్తర్వులు జారీ చేసిన మునిసిపల్ శాఖ
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ ఉద్యమ అమరవీరునికి సముచితమైన గౌరవం దక్కింది. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా మైదానానికి సిరిపురం యాదయ్య పేరు ఖరారు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనతో మునిసిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొని రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలి అమరులు అయిన విషయం తెలిసిందే. వారి పేరున నియోజకవర్గంలోని అతి పెద్ద కార్పొరేషన లోని క్రీడా మైదానంకు సిరిపురం యాదయ్య ప్లే గ్రౌండ్ గా నామకరణం చేస్తూ మునిసిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీచేసారు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Home
Unlabelled
తెలంగాణ ఉద్యమ అమరవీరునికి సముచితమైన గౌరవం.... బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా మైదానానికి సిరిపురం యాదయ్య పేరు... మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనతో ఉత్తర్వులు జారీ చేసిన మునిసిపల్ శాఖ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: