ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత..
నియోజకవర్గంలోని ప్రాచీన దేవాలయాలకు మహర్దశ....
పురాతన గుడుల అభివృద్ధి...భక్తులకు సకల సౌకర్యాలు
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అదే సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట వేయడంతోపాటు మహేశ్వరం నియోజకవర్గ పురాతన దేవాలయాలకు మహర్దశ తీసుకొస్తుంది బీఆర్ఎస్ సర్కార్. ఇందుకోసం రెండు విడతలుగా సుమారు రూ. 8 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చూడుతోంది..
ఈ క్రమంలోనే బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాలాపూర్ లోని అతి పురాతనమైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయాలంలో ఆదివారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేయించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేసారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గ అతి పురాతనమైన ఆలయాలకు మహర్దశ పట్టనుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రంలోని శివగంగా దేవాలయం, తుక్కుగూడ మునిసిపాలిటీ ఫాబ్ సిటీ శ్రీ వెంకటేశ్వర ఆలయం,ఆర్ కె పురం డివిజన్ లోని ఖిలా మైసమ్మ దేవాలయానికి, తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని జన్నాయి గూడ శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి దేవాలయం, జిల్లెల గూడ శ్రీ వెంకేశ్వర స్వామి గుడులకు కోటి రూపాయల చొప్పున మంజూరు చేయించినట్లు పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
అదే విధంగా గట్ పల్లి శ్రీ వీరంజనేయ స్వామి మందిరానికి కోటి రూపాయలు, ఉప్పగడ్డ తండా శ్రీ సేవాలాల్ మహరాజ్ గుడికి కోటి రూపాయల చొప్పున నిధుల విడుదల అయ్యాయన్నారు. ఆయా దేవాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అభివృద్ధి పనులకు, భక్తుల సౌకర్యాలకు ఈ నిధులు వినియోగించనున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా యాదాద్రి టెంపుల్ ను పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. నియోజకవర్గంలోని అతి పురాతనమైన దేవాలయాల అభివృద్ధికి కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గంలోని 8 ప్రాచీన దేవాలయాల్లో కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు,కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు అనేక వరాలు ఇచ్చారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కూడా బ్రాహ్మణ పరిషత్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వెల్లడించారు.
Home
Unlabelled
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత.. నియోజకవర్గంలోని ప్రాచీన దేవాలయాలకు మహర్దశ.... పురాతన గుడుల అభివృద్ధి...భక్తులకు సకల సౌకర్యాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: