కేసీఆర్... కేటీఆర్ ల సహకారంతో

మీర్ పేట్ కార్పొరేషన్ సమగ్రాభివృద్ధికి కృషి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

మీర్ పేట్ కార్పోరేషన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఆర్ సి ఐ రోడ్డు నుండి  డి ఎన్ ఆర్ కాలనీ, లలిత నగర్, మీదుగా నందనవనం వరకు ఒక కోటి 20 లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులకు,రాఘవేంద్ర నగర్ నుండి న్యూ గాయత్రి నగర్ వరకు 65 లక్షలతో చేపట్టే  రోడ్డు విస్తరణ పనులకు, అంబెడ్కర్ విగ్రహం నుండి న్యూ గాయత్రి నగర్ వరకు 60 లక్షలతో చేపట్టే రోడ్డు వెడల్పు పనులకు, ఆటో స్టాండ్ నుండి క్రికెట్ గ్రౌండ్ లైబ్రరీ వద్ద పోస్ట్ బాక్స్ వరకు 85 లక్షలతో చేపట్టే రోడ్డు పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులతో మీర్ పేట్ కార్పొరేషన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.


తాగునీరు, రోడ్లు,డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలతో పాటు పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృతా మార్కెట్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు,ఇప్పటికే చందనం చెరువు అభివృద్ధి చేసామని, మిగతావి కూడా అదేవిధంగా సుందరికరణ చేస్తామన్నారు.  తెలంగాణ రాష్ట్రం సాధించి 9 ఏళ్ళు పూర్తి చేసుకొని 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమాలలో మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ, కార్పొరేటర్ లావణ్య, కార్పొరేటర్లు, అధికారులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: