నాళాలు, తాగునీటి సమస్య లకు శాశ్వత పరిష్కారం కోసం కృషి 

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తుక్కుగూడ మునిసిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తూ.....

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తుక్కుగూడ మునిసిపాలిటీ మంఖాల్  లో   6, 7, 8 వ వార్డులలో ఒక కోటి 36 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్,  మునిసిపల్,  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషితో మహేశ్వరం నియోజకవర్గ కార్పొరేషన్లు,  మునిసిపాలిటీలలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నాళాలు,


తాగునీటి సమస్య లకు శాశ్వత పరిష్కారం కోసం 320 కోట్లతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నాలుగు చోట్ల సమీకృతా మార్కెట్ లు, వైకుంఠ దామాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.కోట్లాది రూపాయలతో రోడ్లు,  కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.సుమారు 40 కోట్ల నిధులతో 10 చెరువులను సుందరికరణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. అభివృద్ధి-సంక్షేమాలు మా నినాదాలు - విధానాలని అన్నారు..

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: