బక్రీద్ పండుగ సందర్భంగా ,,,,

ఇండియన్ రెడ్ క్రాస్  సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం,,,

ప్రారంభించిన....నంద్యాల జిల్లా  కలెక్టర్,  ఎస్పీ, ఎమ్మెల్సీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో స్థానిక నంద్యాల పట్టణంలోని భీమవరం రహదారిలో ఉన్న పాత ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా సామూహిక ప్రార్థనలు చేసిన అనంతరం త్యాగాలకు ప్రతిరూపమైన బక్రీద్ పండుగ రోజున ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశంతో 25 మంది ముస్లిం యువకులు స్వచ్ఛందంగా మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడం హర్శించదగ్గ విషయమని,రక్తదాన శిబిరంలో పాల్గొన్న 25 ముస్లిం యువకులకు ప్రశంస పత్రాలు మరియు మెమొంటోలను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్,ఎస్పీ రఘువీరారెడ్డి,ఎమ్మెల్సీ ఇసాక్ భాష అందచేశారు.


బక్రీద్ పండగ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి నంద్యాల జిల్లాలో నూతన చరిత్ర సృష్టించిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జఫ్రూల్లా,నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లింగేశ్వరరావు, నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి, కోశాధికారి నాగేశ్వరరావు,  నంద్యాల మండల సబ్ బ్రాంచ్ వైస్ చైర్మన్ సోహెల్, డీఎఫ్ఓ రాజునాయక్,రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్స్, మరియు ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది,రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.

 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: