ఒకే రోజు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్లకు యాక్సిరెంట్


తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో మొదలైన రోడ్డు ప్రమాదాలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజే ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమాదానికి గురయ్యారు. అయితే.. పొద్దున మంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. అయితే.. రోహిత్ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావటంతో.. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే.. ఆ ఘటన జరిగిన కాసేపటికే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిర్మల్ బైపాస్ సమీపంలో కొరటికల్ కార్నర్ వద్ద ఒక్కసారిగా ఆవు అడ్డు రావటంతో.. ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో.. కారు మొత్తం నుజ్జు నుజ్జు కాగా.. ఎమ్మెల్యే చేతివేలికి గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావటంతో.. వెంటనే మరో వాహనంలో బోథ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే.. ఇదే రోజున ఉదయం వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు కూడా ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని ఉడిపి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి.. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అయితే.. ఆ కారు బుల్లెట్ ఫ్రూఫ్ కావటంతో.. రోహిత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ విషయంపై రోహిత్ రెడ్డి కూడా స్పందించారు. తనకు యాక్సిడెంట్ అయిన విషయం నిజమేనని.. కానీ తనకు ఎలాంటి గాయాలు కాలేదని క్లారిటీ ఇచ్చారు. తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు.

మరోవైపు.. ఇదే నెలలో సరిగ్గా 12 రోజుల క్రితం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 2కే రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ వెళ్తే క్రమంలో ప్రమాదం జరిగింది. మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి దగ్గర.. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి... అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అయితే.. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినగా.. కౌశిక్ రెడ్డికి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. కారులోని ఎయిర్‌ బెలూన్స్ ఓపెన్ కావటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది.

పదిహేను రోజుల గ్యాప్‌లోనే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు అందులోనూ ఒకేరోజు ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రమాదాలు జరగటం.. శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వరుసగా కారు ప్రమాదాలు జరగటం అందరినీ కలవరపెడుతోంది. అయితే.. ఈ ప్రమాదాల్లో చిన్న చిన్నగాయాలతోనే నేతలు బయటపడటం ఒకింత ఉపశమనం ఇచ్చినా.. ఇలా ప్రమాదాలు జరగటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: