కేసీఆర్...కేటీఆర్ ఆలోచనలతో

గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోంది

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా మారుతోందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు. సరూర్ నగర్ డివిజన్ లోని లక్ష్మి నగర్ కాలనీలో 32 లక్షలతో నిర్మించే పార్కు నిర్మాణ పనులకు  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఎట్లుండెనో,ఇపుడు ఎట్లా మారిందో చూడాలన్నారు.ఎల్ బి నగర్ చౌరస్తాలో నూతనంగా నిర్మితం అయిన ఫ్లై ఓవర్లు,అండర్ పాస్ లతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయన్నారు.నూతనంగా నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నగరంలో పార్క్ లతో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందన్నారు. స్వచ్ఛమైన గాలి, కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తుందని, విరివిగా మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు.ఇందులో భాగంగా ప్రతి ఏటా హరితహారం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.తెలంగాణ పదేళ్ల పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

ఈ సందర్భంగా భారీ ర్యాలీతో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి స్వాగతం పలికారు...నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు జిందాబాద్ అంటూ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.లక్ష్మినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రికి స్వాగతం పలికి,పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయనంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి,  పార్టీ డివిజన్ అధ్యక్షులు మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ, అరవింద్ శర్మ, నాగేష్, కొండల్ రెడ్డి, ముద్ద పవన్, సాజిద్ పాల్గొన్నారు.






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: