పోడు కేసులు ఎత్తేస్తాం,,,,గిరిజనులకు సీఎం కేసీఆర్ అభయం

పోడు రైతులపై గతంలో నమోదైన పోడు కేసులన్నీ ఎత్తేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పోడు రైతులకు ఈ సారి నుంచే రైతుబంధు అమలు చేస్తామని చెప్పారు. కుమురంభీం ఆసిఫాబాద్ నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం.. నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పోడు భూముల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మంది పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ది చెందుతుందని.., స్వరాష్ట్రం సాధించుకున్నాం కాబట్టే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చిందని వ్యాఖ్యనించారు. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలలో సీజనల్ వ్యాధులు ప్రబలేవని నేడు.. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించటంతో వ్యాధులు లేవని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపంచారు. జిల్లాలోని నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల వ్యవసాయ పొలాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కౌటాల మండలం నుంచి వార్దా నది మీదుగా మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 75 కోట్ల మంజూరు చేస్తామన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి చర్యలు చేపడుతామని అన్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, కాగజ్‌నగర్, అసిఫాబాద్ మున్సిపాలిటీలకు చెరో రూ. 25 కోట్ల చొప్పున సీఎం ప్రత్యేక ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు కూడా ఇదే వేదికపై నుంచి సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు. జిల్లాలోని7 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, 311 గ్రామపంచాయితీలకు తలా రూ. 10 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు.

ధరణి మంచి స్కీమ్ అని.. కాంగ్రెస్ నేతలు మాత్రం ధరణి రద్దు చేస్తామని చెబుతున్నారన్నారు. ధరణి పోతే మళ్లీ పైరవీకారులే వచ్చి దోచుకుంటారన్నారు. ధరణి ఉంటేనే మనకు లాభమని.. ధరణి వల్లే రైతు బీమా అందుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన మంచినీరు, ప్రజల ఆరోగ్యం, పేద పిల్లలకు మంచి విద్య, ప్రజలకు సుపరిపాలన అందించటమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీం నినదించిన ఈ జిల్లా నుంచే పోడు పట్టాలు పంపిణీ చేయటం సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: