రైతును రాజును చేసే ప్రభుత్వం మనది
అన్నదాత సంక్షేమంలో బీఆర్ఎస్ సర్కారీ ముందుంటుంది
రైతుబంధు... రైతుబంధు భీమా... 24 గంటల నిర్విరామ కరెంట్ అందిస్తున్నాం
సకాలంలో ఎరువులు పంపిణీ..,పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
రైతును రాజును చేసే ప్రభుత్వం తమది అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు.మహేశ్వరం నియోజకవర్గం దుబ్బచర్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో భాగంగా దుబ్బచర్ల రైతు వేదిక దగ్గర జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రైతు దినోత్సవం నిర్వహించారు.
రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... రైతు బంధు పథకం తో పాటు రైతు భీమా అందిస్తూ వ్యవసాయానికి నిర్విరామంగా పాటుగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతులకు పంటల కోసం సకాలంలో ఎరువులు అందించడంతోపాటు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామన్నారు.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపడంతోపాటు పూర్తిగా రైతు పక్ష పాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీష్ తో పాటు జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, ,ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.
Home
Unlabelled
రైతును రాజును చేసే ప్రభుత్వం మనది అన్నదాత సంక్షేమంలో బీఆర్ఎస్ సర్కారీ ముందుంటుంది రైతుబంధు... రైతుబంధు భీమా... 24 గంటల నిర్విరామ కరెంట్ అందిస్తున్నాం ,,,,, సకాలంలో ఎరువులు పంపిణీ..,పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం ,,,, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: