ప్రాచీన వారసత్వ సంపదను కాపాడి భావి తరాలకు కానుకగా ఇద్దాం

మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ లో బురుజుకు ఆధునిక హంగులు

మీర్ పేట్ బురుజును ప్రారంభించి ప్రజలకు అంకితం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

శిథిలావస్థకు చేరిన 200 ఏళ్ల కాలం నాటి అతి పురాతనమైన మీర్ పేట్ బురుజును  40 లక్షలతో  మరమ్మతులు చేపట్టి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుందరీకరణ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...25 ఆడుగుల బురుజు నిర్మాణంతో మీర్ పేట్ కు మంచి రోజులు రావాలని...శిథిలావస్థకు చేరిన పాత బురుజుని కాపాడుతూనే నూతనంగా తీర్చిదిద్దటంతో అందరి ప్రశంసలు అందుతున్నాయన్నారు.  యాదాద్రి ని పునర్నిర్మాణం చేసి  ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయారన్నారు. జాగ్రత్తగా పాత బురుజును,మాత ఆశిశులతో చేపట్టామని,ఈ నిర్మాణంలో  భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.


మాత తుల్జా భవాని ఆశిశులతో ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తి చేసినట్లు తెలిపారు.మీర్ పేట్ బురుజు షూటింగ్ లకు అడ్డాగా మారాలి.మహేశ్వరం నియోజకవర్గాన్ని నా స్వంత ఇంటి లాగా తీర్చిదిద్దుతున్న అన్నారు. కేటీఆర్ పురాతనమైన మెట్లబావి,తదితర వాటిని కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరికరిస్తున్నారు...అదే విధంగా మహేశ్వరం మెట్ల బావిని కూడా కోటి రూపాయలతో 3 నెలల్లో ప్రజలకు అంకితం చేస్తాం.  మహేశ్వరం నియోజకవర్గంలో 65 గొలుసుకట్టు చెరువులు ఉండేవని వాటిలో కొన్నింటికి లింకులు కాలనీల రాకతో లేకుండా పోయాయని..ఇప్పుడు ఉన్న చెరువుల అభివృద్ధి కి కృషి చేస్తున్నాం అన్నారు.....కేసీఆర్ పాలనకు వరుణ దేవుని ఆశీసులు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే 30 ఏళ్ళు అయిన కాలేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసే వారు కాదన్నారు.నేడు 3 ఏళ్లలో పూర్తి చేసి రికార్డ్ సృష్టించి రాష్టాన్ని సస్యశ్యామలం చేసారన్నరు.  

ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్,  డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ గోవర్ధన్ రెడ్డి,  బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భుపేష్,  మాజీ ఎంపీపీ,  కార్పొరేటర్ లావణ్య, కార్పొరేటర్లు మాధవి సాయి నాథ్ రెడ్డి,  నవీన్ గౌడ్, రవి నాయక్, లార్డ్స్ బీరప్ప, అక్కి మాధవి, జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి,  వేముల నరసింహ్మ,  రాంచంద్, విజయ్, అనిల్, రాజ్ కుమార్,  రాజేందర్ రెడ్డి, అంజయ్య,  పల్లె జంగయ్య,  మహిళ అధ్యక్షురాలు పద్మ రెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పంతంగి మాధవి,  మాజీ సర్పంచ్ పాండు గౌడ్, ఇతర  నాయకులు పాల్గొన్నారు.








Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: