కొండగల్‌లో నుంచే బరిలోకి రేవంత్ రెడ్డి

టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన ఎక్కిడ నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఆయన మల్కాజిగిరి ఎంపీగా ఉండగా.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ అన్ని కలిసొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రేవంత్ సీఎం రేసులో ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది గత కొంతకాలంగా ప్రశ్నార్థకమైంది. 2009లో ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన మెుదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఆ తర్వాత 2014లో అదే నియోజవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేస్తారా? లేక హైదరాబాద్ నగరంలోని మరో నియోజవర్గం నుంచి అసెంబ్లీ బరిలో నిలుస్తారా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆ సందిగ్ధతకు రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి తెర దించారు.

రేవంత్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. కొడంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి రెడ్డి.. ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తమ కుటుంబానికి గుర్తింపు తెచ్చిన నియోజక వర్గాన్ని వదిలి ఇతర ప్రాంతాల నుంచి పోటీ చేస్తారని ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఈసారి అధికారంలోకి తీసుకొస్తారని.. కొడంగల్ నియోజవర్గం నుంచి ఆయన్ను 50 వేలకు పైగా మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ముఖ్యమంత్రి‌గా రేవంత్ రెడ్డి నియోజక వర్గానికి 69 జీవో ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తారని అన్నారు. ఇలా తిరుపతి రెడ్డి చేసిన కామెంట్లతో రేవంత్ పోటీ చేసే స్థానంపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: