ఎంపీ ఎంవీవీ భార్య, కొడుకు కిడ్నాప్.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం


విశాఖపట్నంలో గురువారం కిడ్నాప్ కలకలం రేగింది. ఏకంగా ఎంపీ భార్యా కొడుకులను దుండగులు కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని బందీలను విడిపించారు. రిషికొండలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, ఎంపీ భార్య, కొడుకును బంధించారని సమాచారం. ఆపై వారితో ఆడిటర్ కు ఫోన్ చేయించి పిలిపించారని, ఆడిటర్ వచ్చాక ముగ్గురినీ కిడ్నాప్ చేశారని తెలుస్తోంది.

ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ సమాచారం అందడంతో వేగంగా స్పందించిన పోలీసులు.. కిడ్నాపర్ల ఆచూకీ కనిపెట్టి, బందీలను విడిపించారు. కిడ్నాపర్లను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ ఘటనపై స్పందించారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: