పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందించేందుకు కృషి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 'వైద్య మరియు ఆరోగ్య శాఖ అధ్వర్యంలో మీర్ పేట్ కార్పొరేషన్ లోని జిల్లెల గూడ ఎస్ వై ఆర్ కన్వెన్షన్ లో జరిగిన తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య వ్యవస్థ ను ప్రక్షాళన చేసి పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందించాటానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.నీతి ఆయోగ్ సర్వే లో మన రాష్టం వైద్య విభాగంలో మూడవ స్థానం,సౌకర్యాల కల్పనలో మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు.
డాక్టర్ కనిపించే దేవుడు అని ప్రజల నమ్మకం అని,కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేసిన వైద్యుల,నర్సుల,ఆశల సేవలు ఎంతో గొప్పవని అన్నారు.సమాజంలో అమ్మ పాత్ర పోషించే ఆశ వర్కర్ల జీతాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచారని మంత్రి గుర్తు చేసారు.కేసీఆర్ కిట్ తో అబ్బాయి పూడితే 12 వేలు,అమ్మాయి పూడితే 13 వేలు అందిస్తూ ఇప్పటివరకు 13 లక్షల 90 వేల మందికి అందించినట్లు తెలిపారు.57 పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా చేస్తుందన్నారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నట్లు వాటిలో రెండు రంగారెడ్డిలొనే 1200 కోట్ల చొప్పున వ్యయంతో వేయి పడకలు ఉండేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఉస్మానియా, గాంధీ లపై భారం పడకుండా వీటిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమ్మ వడి వాహనాలు,బస్తీ దవాఖానాలతో వైద్యము పేదల దరికి చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు. ముందు హైదరాబాద్ లొనే బస్తీ దవాఖానలు ప్రారంభించిన అనంతరం రంగారెడ్డి పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు మొత్తం 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసామన్నారు.మహిళ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ప్రతి మంగళవారం మహిళలకు పి హెచ్ సి లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు,మోకాళ్ల నొప్పుల ఆపరేషన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ లో మరో రెండు వేల పడకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.మొత్తం 6 వేల బెడ్లు అందుబాటులో వస్తాయన్నారు.
కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని ప్రజలకు ఇస్తున్న అద్దాలు మన తెలంగాణలో తయారవుతున్నాయన్నారు.35-45 నుండి ఏళ్ల లోపు వారు ఇటీవలి కాలంలో అకస్మాత్తుగా గుండె పోటుకు గురవుతున్నారని,అలాంటపుడు వారి ప్రాణాలు కాపాడటానికి నిర్వహించే సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి శిక్షణ, అవగాహన ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు.వైద్య రంగంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం బాగుంటుందని మంత్రి పేర్కొన్నారు.గర్భిణీ మహిళల్లో రక్తహీనత సమస్యను దూరం చేయటానికి న్యూట్రిషన్ కిట్లను ఇస్తున్నట్లు తెలిపారు.జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయటంతో మెడికల్ సీట్లు కూడా భారీగా పెరిగాయన్నారు. పేదలకు ఉచితంగా బీపీ, షుగర్ ట్యాబ్ లెట్లు అందిస్తున్నట్లు, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.సీఎం రిలీఫ్ ఫండ్,ఎల్ ఓ సి లు వివిధ ఆపరేషన్లు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిది నుండి పెద్ద ఎత్తున అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు.ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆశీర్వదించాలని కోరారు.గర్భిణీ మహిళల్లో రక్త హీనత సమస్యను అధిగమించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్ల కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ప్రారంభించి,మహిళలకుమంత్రి సబితా రెడ్డి అందించారు. అదేవిధంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆశ, ఏఎన్ఎం లకు చీరలు పంపిణీ చేసారు.ఉత్తమ వైద్యులకు,నర్సులకు అవార్డులు అందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, కలెక్టర్ హరీష్, మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, ఆర్డీవో సూరజ్ కుమార్, జడ్పీటీసీ జంగారెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు, తహశీల్దార్ జనార్దన్,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Home
Unlabelled
పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందించేందుకు కృషి,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: